ఆ విషయంలో విరాట్ కోహ్లీ ని దాటేసిన మహేష్ బాబు..!

By iQlikMovies - December 05, 2018 - 17:19 PM IST

మరిన్ని వార్తలు

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం, పాపులారిటీ ఉన్న ఆట‌గాళ్ల‌లో విరాట్ కోహ్లీ పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. బ్రాండ్ల రూపంలోనే యేటా వంద‌ల కోట్ల రాబ‌డి వ‌స్తుంటుంది. వాణిజ్య ప్ర‌క‌ట‌నల్లో న‌టించినందుకు ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అందుకే అత‌ని.. జీవితం అత్యంత విలాస‌వంతంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ చేసే ఖ‌ర్చుకోసం తెలుసుకుంటే దిమ్మ‌తిరిగిపోతోంది. అత‌ను మామూలు నీళ్లు తాగ‌డు. అత‌ని కోసం ఫ్రాన్స్ నుంచి ప్ర‌త్యేకంగా వాట‌ర్ బాటిళ్లు దిగుమ‌తి అవుతుంటాయి. లీటర్ బాటిల్ ఏకంగా రూ.600.  ఈ విష‌యం విరాట్ అభిమానులంద‌రికీ తెలుసు. `విరాట్ ఏకంగా మంచి నీళ్ల కోసం ఆరొంద‌లు ఖ‌ర్చు పెడ‌తాడా` అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇప్పుడు ఈ విష‌యంలో విరాట్ ని దాటేసే మొన‌గాడు వ‌చ్చాడు... త‌నే మ‌హేష్ బాబు. అవును.. మహేష్ కూడా ఆరోగ్య విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. దానికి తోడు టాలీవుడ్‌లో అత్యంత సంప‌న్న‌ప‌రుల‌లో త‌నొక‌డు. మ‌హేష్ కోరుకుంటే ద‌క్క‌నిది ఏముంది?  మ‌హేష్‌కూడా తాను తాగే నీళ్ల బ్రాండ్ మార్చాడు. ఆ నీళ్ల ధ‌ర లీట‌ర్‌కి 1200 వంద‌ల పైమాటే అని టాక్‌.

సముద్రానికి సుమారు 600అగుడుల ఎత్తున ఉన్న‌ సహ్యాద్రి పర్వత శ్రేణి లో ఈనీళ్లు పుట్టుకొస్తాయ‌ని, ఇవి అత్యంత స్వ‌చ్ఛ‌మైన‌వ‌ని, ఏ ర‌క‌మైన కాలుష్యానికి గురికాని నీళ్ల‌ని అందుకే.. ఆ నీటికి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంద‌ని తెలుస్తోంది. అతి కొద్ది సెల‌బ్రెటీలు మాత్ర‌మే ఈ నీటిని కొనుకోలు చేస్తుంటార్ట‌. అందులో మ‌హేష్‌కూడా ఉన్నాడ‌ని స‌మాచారం. బ‌హుశా ఇన్నేళ్ల‌యినా.. మ‌హేష్ గ్లామ‌ర్ చెక్కు చెద‌ర‌డం లేదంటే.. అత‌ని గ్లామ‌ర్ ర‌హ‌స్యం ఇదే కావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS