ఫోర్బ్స్ సంస్థ 2018లో అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల లిస్టు విడుదల చేసింది. 100 మందితో కూడిన ఈ లిస్టులో మన టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చోటు దక్కించుకున్నాడు. 14 కోట్లు సంపాదనతో విజయ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'నోటా' ఈ సినిమాలు విజయ్ దేవరకొండను ఈ స్థాయిలో నిలబెట్టాయి. విజయ్ దేవరకొండతో సమానంగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ 72వ స్థానాన్ని పంచుకున్నాడు.
అల్లు అర్జున్ 15.67 కోట్లుతో 64వ స్థానం దక్కించుకుంటే, దర్శకుడు కొరటాల శివ 20 కోట్లతో 39వ స్థానంలో నిలిచాడు. కింగ్ నాగార్జున సంపాదన 22.25 కోట్లు కాగా అతనికి 36వ స్థానం దక్కింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు 24. 33 కోట్లుతో 33వ స్థానంలో నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28 కోట్లుతో 28వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ నుండి సంపాదన పరంగా నెంబర్ వన్ పొజిషన్ పవన్‌కళ్యాణ్‌కే దక్కింది. మొత్తం 100 మంది లిస్టులో పవన్ ర్యాంక్ 24. సంపాదన 31.33 కోట్లు. వంద మంది లిస్టులో టాప్ పొజిషన్ సల్మాన్‌ఖాన్‌ది.
అతని సంపాదన 253.25 కోట్లు. రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ, మూడో స్థానంలో అక్షయ్ కుమార్, నాల్గవ స్థానం దీపికా పదుకొనె, ఐదో స్థానంలో మహేందర్ సింగ్ ధోనీ, ఆరవ స్థానంలో అమీర్‌ఖాన్, ఏడవ స్థానంలో అమితాబ్, ఎనిమిదవ స్థానం రణ్‌వీర్ సింగ్, తొమ్మిదో స్థానంలో సచిన్, పదో స్థానంలో అజయ్‌దేవగణ్ ఉన్నారు. ఆయా ప్రముఖులు ఆయా రంగాల్లో దక్కించుకుంటున్న అవకాశాలు, తద్వారా వచ్చే రెమ్యునరేషన్, వారి వ్యాపకాలు వంటి వాటి ఆధారంగా ఈ లిస్టు తయారవుతుంది.