మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు..' సినిమా నుండి ఇంతవరకూ ఫస్ట్‌లుక్ టీజర్ మాత్రమే వచ్చింది. కానీ, ఈ సినిమాతో విడుదలకు పోటీ పడుతున్న బన్నీ సినిమా 'అల వైకుంఠపురములో..' మాత్రం పబ్లిసిటీ దంచేస్తోంది. విడుదల చేసినవి రెండు పాటలు మాత్రమే. కానీ, రెండూ రెండూ ఊపేస్తున్నాయి. మొదటి పాట రికార్డులు సృష్టిస్తుంటే, రెండో పాట ఉర్రూతలూగించేస్తోంది. సినిమాపై భారీగా బజ్ పెంచేసింది. ఇంకా ఈ సినిమా నుండి రావల్సిన సర్‌ప్రైజులు చాలానే ఉన్నాయి.
ఒక్కో సర్‌ప్రైజ్ ఒక్కో రికార్డే అంటున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికొస్తే, పబ్లిసిటీ విషయంలో చాలా వీక్‌గా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ మహేష్ - రష్మికలతో పాటు, ఇంపార్టెంట్ రోల్ అయిన విజయ శాంతి పాత్రల పరిచయాలు మాత్రమే అయ్యాయి. అయినంతలో వీటికి ఓకే అనే రెస్పాన్స్ వచ్చినా ఇది చాలదు. పబ్లిసిటీ జోరు ఇంకా చాలా చాలా పెంచాలి అంటూ ఫ్యాన్స్ నుండి యూనిట్‌పై ఒత్తిడి పెరుగుతోందట. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణతో బిజీగా ఉంది చిత్ర యూనిట్.
అయినా, షూటింగ్ మొత్తం పూర్తయ్యాక తీరిగ్గా పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాంలే అనుకునే రోజులు కావివి. షూటింగ్ దారి షూటింగ్‌దే. ప్రమోషన్ దారి ప్రమోషన్‌దే. మనసు పెట్టి ఆలోచిస్తే, ప్రమోషన్‌కి బహు దారులు. 'రాములో రాములా..' సాంగ్ ప్రోమోని విడుదల చేసిన విధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అంతకు మించి అనేలా 'సరిలేరు..' సర్‌ప్రైజ్ రావల్సి ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ రెండో వారం నుండి 'సరిలేరు..' ప్రమోషన్స్ షురూ చేయనున్నారనీ తెలుస్తోంది.