సితార, గౌతమ్ ఎంట్రీ పక్కా

మరిన్ని వార్తలు

ఏ రంగంలో వారసత్వం ఉన్నా లేకపోయినా సినీ, రాజకీయ రంగాల్లో మాత్రం వారసత్వ కొనసాగింపు ఉంటుంది. టాలివుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లలో ఇలా ఇప్పటికే కొందరు వారసులు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే చెర్రీ, రానా , చైతు, ఎన్టీఆర్, మహేష్ , ప్రభాస్ లాంటి వారసులు ఉండగా నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతోంది. త్వరలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక పవన్ కొడుకు అఖీరా నందన్ గూర్చి,  మహేష్  కొడుకు గౌతమ్ గూర్చి ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్  కూతురు సితార ఇప్పటికే యాడ్స్, సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కొడుకు ఎంట్రీ ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అసలు గౌతమ్ సినిమాల్లో నటిస్తాడా లేదా అన్న సందేహం కూడా ఉంది. 


రీసెంట్ గా ఇదే విషయం పై సితార స్పందిస్తూ అసలు సీక్రెట్ చెప్పేసింది. తనతో పాటు అన్నయ్య గౌతమ్ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడని క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన కెరీర్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి చెప్తూ తాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ, లండన్ లాంటి చోట్ల యాక్టింగ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయినట్టు తెలిపింది. ఈ ఎగ్జామ్స్ లో సితార మంచి స్కోర్ సాధించినట్లు కూడా చెప్పింది. భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు  చెప్తూ, అన్నయ్య గౌతం గూర్చి కూడా బయట పెట్టేసింది. 


తన అన్నయ్య గౌతమ్ కూడా యాక్టింగ్ కెరీర్ నే ఎంచుకున్నాడని, అందుకు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగేళ్ల యాక్టింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నాడని తెలిపింది. తామిద్దరం యాక్టింగ్ ప్రొఫెషన్ ని ఎంచుకోవటంతో మహేష్ , నమ్రత ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళే తామిద్దర్నీ ఎంకరేజ్ చేస్తున్నారని చాలా సంతోషంగా చెప్పింది సితార. దీనితో 'ఫ్యూచర్ సూపర్ స్టార్ గౌతమ్' అంటూ మురిసిపోతున్నారు ఫాన్స్. ఇప్పటికే మహేష్ అన్న రమేష్ బాబు కొడుకు సినిమా ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గౌతమ్, సితార సినిమా ప్రయాణంపై స్పష్టత వచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS