మహేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'స్పైడర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగుతో పాటు, తమిళంలోనూ తెరకెక్కుతోంది. తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నాడట మహేష్. అయితే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి విడుదలపై. నిన్నటి దాకా ఆగష్టులో సినిమా వస్తుందని అంతా ఆశించారు. అది కాస్త సెప్టెంబర్‌కెళ్లింది. సెప్టెంబర్‌పై కూడా కొన్ని అనుమానాలు నెలకొన్నాయి తాజాగా. అందుకే ఆ అనుమానాల్ని పటాపంచలు చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. వంద కోట్ల పై బడిన బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ఇది. టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే అదిరిపోయింది ఆ టీజర్. త్వరలో ఇంకో టీజర్ రాబోతోంది. ఈ టీజర్ ఇంకా అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి తమిళ, తెలుగు టీజర్స్ రెండిటినీ ఒకేసారి విడుదల చేస్తారట. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురుగదాస్ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ డైరెక్టర్ కమ్ హీరో ఎస్‌జె సూర్య ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా నటిస్తున్నాడు. అన్నట్లు మహేష్‌తో 'నాని' సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్.జె.సూర్య. అంతేకాదు తమిళ యంగ్ హీరో భరత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. మహేష్ ప్పై కాప్ పాత్ర పోషిస్తున్నాడు. టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉండబోతోంది ఈ సినిమా.