'స్పైడర్' టీజర్ ఇటీవలే విడుదలైంది. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'స్పైడర్ టీజర్ కోసం చాలా కాలంగా ఎదురు చూశారు అభిమానులు. అయితే విత్ అవుట్ డైలాగ్స్, జస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో టీజర్ విడుదలైంది. ఓ రోబో స్పైడర్ హీరో కాలి మీదుగా భుజం మీదికి చేరుతుంది. దాన్ని వారించే విధంగా హీరో ష్! అంటూ సౌండ్ చేస్తాడంతే. అదీ ఆ టీజర్. అయితే నిశ్శబ్దంలోనే మహేష్ అభిమానులు బోలెడంత ఊహించుకుని ఎంజాయ్ చేశారు. అలా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మహేష్ నుండి ఇంకా ఏదో కోరుకుంటున్నారు అభిమానులు. అభిమానుల కోరిక తీర్చేందుకు మహేష్ కూడా రెడీ అవుతున్నాడు. మరో టీజర్‌ని విడుదల చేసేందుకు మహేష్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఈ నెలాఖరుకల్లా ఆ టీజర్ రానుందట. రాబోయే ఆ టీజర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ కానున్నారనీ తెలుస్తోంది. మురుగదాస్ డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రమిది. మహేష్‌కి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం కూడా. తెలుగుతో పాటు, తమిళంలో కూడా సినిమా విడుదల కానుంది. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ యంగ్ హీరో భరత్ కీలకపాత్ర పోషిస్తుండగా, తమిళ డైరెక్టర్ కమ్ హీరో ఎస్.జె.సూర్య మహేష్‌కి విలన్‌గా నటిస్తున్నాడు ఈ సినిమాలో. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.