ఉభయగోగావరి జిల్లాల్లో 'రంగస్థలం' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చరణ్ సరసన సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసినదే కదా. వర్షాకాలంలో గోదావరి తీరం ప్రత్యేకమైన అందాల్ని సంతరించుకుంటుంది. ఆ అందాలు అద్బుతమే అయినా, షూటింగ్ ఇంకా కష్టంగా ఉంటుంది. అదే చిత్ర యూనిట్‌కి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆహ్లాదం ఓ వైపు, వర్షం కారణంగా సమస్యలు ఇంకో వైపు - అయినప్పటికీ చిత్ర యూనిట్ ఏమాత్రం తొణకకుండా బెణకకుండా శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా షూటింగ్ జరుగుతోందట. కథానాయకుడు రామ్‌చరణ్‌కి షూటింగ్ సందర్భంగా చిన్న గాయాలు కావడంతో యూనిట్ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారట. అయితే ఆ గాయాల్ని చరణ్ ఏమాత్రం లెక్కచేయకుండా తిరిగి షూటింగ్‌కి హాజరయ్యేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కమర్షియల్ హీరోగా తన స్టామినాని కొంచెం పక్కన పెట్టి, 'రంగస్థలం' అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చినప్పుడే రామ్‌చరణ్ నటుడిగా ఏ స్థాయి కమిట్‌మెంట్‌తో ఉండి ఉంటాడో కదా. చెర్రీ కమిట్‌మెంట్‌ని దగ్గరుండి చూస్తున్న చిత్ర యూనిట్ ఆశ్చర్యానికి గురవుతోంది.