మహేష్‌తో సుకుమార్‌.. మళ్ళీ ప్రయోగమేనట!

మరిన్ని వార్తలు

విలక్షణ దర్శకుడు సుకుమార్‌ ప్రయోగాల బాట పట్టాడు. 'రంగస్థలం' లాంటి వెండితెర అద్భుతాన్ని రూపొందించి, సంచలన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని కూడా ఓ ప్రయోగాత్మక కథతోనే రూపొందించబోతున్నాడట. ఇందుకు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. 

ముందుగా మహేష్‌తో మాంఛి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని అనుకున్నాడు సుకుమార్‌. అయితే మహేష్‌ కూడా ఈ మధ్య ప్రయోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ బోర్‌ కొట్టేయకపోయినా, కొత్తదనంతో కొత్త కొత్తగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే ఆలోచనతో వున్న మహేష్‌, సుకుమార్‌ని ఆ దిశగా కథ రెడీ చేయమని చెప్పాడట. హీరో నుంచి వచ్చిన సూచనతో సుకుమార్‌, పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ సూపర్బ్‌ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

'రంగస్థలం' కూడా అంతే. అది 85ల నాటి నేటివిటీతో రూపొందింది. ఆనాటి పరిస్థితుల్ని సుకుమార్‌ అత్యద్భుతంగా ఆ సినిమాలో చూపించి, నేటి తరాన్ని మెప్పించడం తెలిసిన సంగతే. నిజానికి ఇది చాలా పెద్ద రిస్క్‌. ఆ రిస్క్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టిన సుకుమార్‌పై మహేష్‌, పూర్తి నమ్మకం పెట్టుకోవడం సహజమే. 

సుకుమార్‌, మహేష్‌ కాంబినేషన్‌లో ఇదివరకు '1 నేనొక్కడినే' సినిమా వచ్చింది. అదొక సూపర్బ్‌ థ్రిల్లర్‌. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినాసరే, ఇంకోసారి సుకుమార్‌తో సినిమాని 'ప్రయోగానికి' వేదికగానే మార్చుకున్నాడు మహేష్‌. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అంటే, స్వాతంత్య్ర పోరాటం లాంటివని అనుకోవచ్చా.? వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS