అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హీరో

By iQlikMovies - October 16, 2018 - 16:51 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరారు.

అందుతున్న వివరాల ప్రకారం, గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కారణంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రికి ఆయనని తీసుకు వచ్చిన సమయంలో శివ రాజ్ కుమార్ తో పాటుగా ఆయన భార్య, కూతురు & పునీత్ రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తున్నది.

అయితే ఆయన ఆరోగ్య స్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఇక ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి చిత్రపరిశ్రమకి చెందిన ప్రముఖులు ఆయనని కలిసి పరామర్శించారు.

అనారోగ్యం నుండి ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS