'మహర్షి' కూడా శ్రీమంతుడే.!

By iQlikMovies - December 19, 2018 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

స్టార్స్‌లో సూపర్‌స్టార్‌... మహేష్‌బాబు. ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నుండి ప్రయోగాలేమీ రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. 'శ్రీమంతుడు' మహేష్ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రం. ఆ సినిమాలో మహేష్‌బాబు శ్రీమంతుడి పాత్రలో కనిపించాడు. ఊరు దత్తత అనే కాన్సెప్ట్‌ ఆ సినిమాకి బాగా వర్కవుట్‌ అయ్యింది. 

 

ఆ తర్వాత 'భరత్‌ అనే నేను'లోనూ మహేష్‌ శ్రీమంతుడే. ముఖ్యమంత్రి పాత్రలో రిచ్‌ పర్సన్‌గా కనిపించాడు. ఇప్పుడు 'మహర్షి' కూడా శ్రీమంతుడేనట. ఏకంగా ప్రపచంలోనే టాప్‌ 5 రిచ్‌ పీపుల్‌లో మహేష్‌బాబు ఒకరుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారనీ తెలుస్తోంది. రియల్‌ లైఫ్‌లో మహేష్‌బాబు కోటీశ్వరుడే. అలాగే రీల్‌ లైఫ్‌లో కూడా ఈ మధ్య మహేష్‌బాబు ఎంచుకునే పాత్రలన్నీ కోటీశ్వరుడి పాత్రలే కావడం విశేషం. 

 

ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహర్షి' విషయానికి వస్తే, ఈ సినిమాలో టాప్‌ 5 కోటీశ్వరుడైన మహేష్‌బాబు తన చిన్ననాటి ప్రాణ స్నేహితుని కోసం పల్లెటూరికొచ్చి, అక్కడి పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తాడట. తన స్నేహితుని కష్ట నష్టాల్లో తోడుగా ఉంటాడట. అదీ ఈ సినిమా కాన్సెప్ట్‌. 

 

ఆ ప్రాణ స్నేహితుని పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించనున్నాడు. పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తోంది. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌, వైజయంతీ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS