కౌశల్‌కి మహేష్‌ ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడా.?

మరిన్ని వార్తలు

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ మండా, ఆ షో కారణంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించేశాడు. 

కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, సినీ నటుడిగా కౌశల్‌కి గుర్తింపు పెద్దగా వచ్చింది లేదు. మోడలింగ్‌ స్టూడియో నిర్వహిస్తూ, సినిమాలకి మోడల్స్‌ని అందిస్తూ, కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తూ, ఫ్యాషన్‌ షోలు నిర్వహిస్తూ ఇప్పటిదాకా సినీ పరిశ్రమతో టచ్‌లోనే వున్న కౌశల్‌, త్వరలో వెండితెరపై సంచలనాలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తోంది. 'క్రౌడ్‌ ఫండింగ్‌' మోడ్‌లో కౌశల్‌తో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా, రచయిత కమ్‌ దర్శకుడొకరు కౌశల్‌తో త్వరలో సినిమాని అనౌన్స్‌ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. 

ఇదిలావుంటే, బిగ్‌ బాస్‌ సీజన్‌ టూ టైటిల్‌ని గెలిచినందుకు కౌశల్‌ని అభినందిస్తూ, కౌశల్‌ గెలవడం తనకు చాలా ఆనందంగా వుందని సూపర్‌ స్టార్‌ మహేష్‌ ట్విట్టర్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది. కౌశల్‌ తన తొలి సినిమా మహేష్‌తోనే చేశాడు. 'రాజకుమారుడు' సినిమాలో మహేష్‌ స్నేహితుడిగా కన్పించాడు కౌశల్‌. ఆ సమయంలోనే కౌశల్‌, మోడలింగ్‌ స్టూడియో పెట్టడానికి మహేష్‌ కారణమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ, కౌశల్‌ని మహేష్‌ని టాలీవుడ్‌కి కొత్తగా పరిచయం చేస్తాడా.? అన్న చర్చ జరుగుతోంది. 

మహేష్‌ తలచుకుంటే అది పెద్ద పనేమీ కాదు. విలన్‌ పాత్రలకైనా, ఇంపార్టెంట్‌ రోల్స్‌కి అయినా సరిపోయేంత పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ కౌశల్‌ సొంతం. హీరోగానే ఓ పక్క అవకాశాలు వస్తున్న నేపథ్యంలో, మహేష్‌తో ఛాన్స్‌ ఎలాంటిదైనా వస్తే మాత్రం కౌశల్‌ వదులుకోడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS