సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా ఒకప్పుడు ఏ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తోన్న రాజేంద్రప్రసాద్, వ్యక్తిగతంగానూ చాలా మంచోడని సినీ పరిశ్రమలో చాలా మంచి పేరుంది. అయితే రాజేంద్రప్రసాద్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఓ సినిమాలో రాజేంద్రప్రసాద్, హీరోయిన్ మాళవికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో, ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకే దూరమయ్యిందని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. మాళవిక, రాజేంద్రప్రసాద్ 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' అనే సినిమాలో నటించారు. మాళవిక తెలుగులో ఇంకొన్ని సినిమాల్లోనూ నటించింది. 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' విషయంలోనే కాదు, మాళవిక తాను చేసే సినిమాల సందర్భంగా చాలా వివాదాలకు కారణమయ్యింది. తమిళంలోనూ ఆమెది ఇదే పరిస్థితి. 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' షూటింగ్ పూర్తవకుండా నానా యాగీ చేసింది అప్పట్లో మాళవిక.
అలా మాళవిక వ్యవహరించడానికి కారణం రాజేంద్రప్రసాదేనా? అన్న అనుమానాలకు శ్రీరెడ్డి ఆరోపణలు కొంత బలం చేకూరుస్తున్నా, ఇదెంతవరకు నిజం.? అనేది మాత్రం తేలాల్సి వుంది. బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై, తనూశ్రీ దత్తా ఆరోపణలు చేయడంతో అక్కడ చాలా పెద్ద గందరగోళం చోటు చేసుకుంది.
శ్రీరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలామందిపై ఆరోపణలు చేసింది. అయితే మొదట్లో శ్రీరెడ్డి సంచలనం ఓ స్థాయికి వెళ్ళినా, ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశారంతా. శేఖర్‌కమ్ముల, కోన వెంకట్, సురేష్‌బాబు తనయుడు, ఇంకా చాలామంది శ్రీరెడ్డి ఆరోపణల లిస్ట్‌లో వున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్ పేరు ఆ లిస్ట్‌లో చేరడంతో, ఆయన ఈ ఆరోపణలపై స్పందిస్తారా? లేదా? వేచి చూడాలిక.