చ‌ర‌ణ్ - మ‌హేష్‌... ఓ సినిమా!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త షికారు చేస్తోంది. అది నిజ‌మో, కాదో.. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలీదు గానీ, అదే నిజ‌మైతే - టాక్ ఆఫ్ ది టౌన్ ఆ ప్రాజెక్టే అవుతుంది. అదేంటంటే.. మ‌హేష్ బాబు ప్రొడ‌క్ష‌న్ లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమా రాబోతోంద‌ట‌. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వహిస్తార‌ని టాక్‌.

 

మ‌హ‌ర్షి త‌ర‌వాత‌.... మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల్సింది. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల అది కుద‌రలేదు. వంశీ పైడిప‌ల్లి సినిమా ప‌క్క‌న పెట్టి, ప‌ర‌శురామ్ క‌థ‌కి ఓకే చెప్పాడు మ‌హేష్‌. దాంతో.. వంశీ పైడిప‌ల్లి ఖాళీ అయిపోయాడు. ఈలోగా చ‌ర‌ణ్‌కోసం ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. అది మ‌హేష్‌కి సైతం న‌చ్చింద‌ట‌. దాంతో.. ఈ సినిమాని నేనే నిర్మిస్తా.. అని ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. మ‌హేష్ త‌న ప్రొడ‌క్ష‌న్ లో వ‌రుస‌గా సినిమాల్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అడ‌విశేష్ తో `మేజ‌ర్‌` సినిమాని నిర్మిస్తున్నాడు. అన్నీ కుదిరితే... మ‌హేష్ త‌దుప‌రి ప్రాజెక్టు చ‌ర‌ణ్‌తోనే కావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS