సాయిధరమ్ తేజ్ - దేవాకట్టా కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. లాక్ డౌన్ ఇబ్బందుల్ననీ తొలగిపోయి, షూటింగులకు అనుకూలమైన వాతావరణం నెలకున్నప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కలెక్టర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. దేవకట్టా చిత్రాలు సామాజిక నేపథ్యాన్నిప్రతిబింబించేలా ఉంటాయి. ఇందులోనూ ఓ బలమైన సోషల్ మెసేజీ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతానికి ఈ పాత్ర కోసం తేజూ తన కసరత్తులు మొదలెట్టినట్టు సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తేజూ నటించిన `సోలో బతుకే సో బెటరు` విడుదలకు సిద్ధం అవుతోంది. ఇది కాక మరో రెండు సినిమాల్ని తేజూ ఒప్పుకున్నాడు. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి.