సూపర్‌స్టార్ కృష్ణ ఇటివలే మరణించిన సంగతి తెలిసిందే. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేశ్‌బాబు తొలిసారి స్పందించారు. ట్విటర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
‘‘మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం మీది. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా అలా వెళ్లిపోయాయి. అయితే ఇంతకు ముందెన్నడూలేని బలాన్ని ఫీలౌతున్నాను. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్'' అని భావోద్వేగానికి లోనయ్యారు మహేష్ బాబు.
ఈ ఏడాది మహేశ్‌బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో తీవ్ర విషాదంలో వున్నారు మహేష్ బాబు.