`అతడు`, `ఖలేజా` తరవాత.... మహేష్ బాబు - త్రివిక్రమ్ ల కాంబో మరోసారి సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తారు, షూటింగ్ వివరాలు చెబుతారు అనుకున్నారంతా. కానీ అదేం జరగలేదు. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగుల హడావుడి మొదలైనా ఇంత వరకూ మహేష్ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. జులైలో కచ్చితంగా షూటింగ్ లమొదలవుతుందనుకున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
ఒకటి... సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉంది. అదెప్పుడు మొదలవుతుందో తెలీదు. మహేష్ కి షూటింగ్ మూడ్ ఇంకా రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సర్కారు వారి పాట ఓ కొలిక్కి వచ్చాకే... త్రివిక్రమ్ సినిమాకి డేట్లు ఇవ్వాలనుకుంటున్నాడట మహేష్. మరోవైపు త్రివిక్రమ్ కూడా తన ఫోకస్ అంతా.. పవన్ సినిమాపై పెట్టాడు. పవన్ `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ బాధ్యత త్రివిక్రమ్ పై పడింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. సినిమా నిర్మాణంలోనూ తనకు వాటా ఉంది. కాబట్టి.. ఆయన ఫోకస్ అంతా దానిపైనే. పవన్ రీమేక్ పూర్తయ్యేంత వరకూ మహేష్ సినిమా మొదలయ్యే ఛాన్సు లేదని టాక్. అందుకే ఈ కాంబో ఆలస్యం అవుతోంది.