'పోకిరి'ని మ‌రిచాడు, ట్వీట్‌తో స‌రిపెట్టాడు.

By iQlikMovies - May 02, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు కెరీర్‌లో మేలిమి మ‌లుపు పోకిరి. అప్ప‌టి వ‌ర‌కూ స్టార్‌గా ఉన్న మ‌హేష్‌ని ఆ సినిమా సూప‌ర్ స్టార్‌గా మార్చేసింది. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నింటినీ తిర‌గ‌రాసింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అదే ట్రెండ్ సెట్ట‌ర్‌. అలాంటి సినిమాని మ‌హేష్ మ‌ర్చిపోయాడు. 'మ‌హ‌ర్షి' త‌న 25వ సినిమా.

 

ఈ సంద‌ర్భంగా త‌న ప్ర‌యాణాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకున్నాడు. అందులో భాగంగా రాజకుమారుడు, మురారి, అత‌డు, దూకుడు, శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాల్ని, అవి త‌న కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డిన విధానాన్నీ నెమ‌రు వేసుకున్నాడు. ఆయా ద‌ర్శ‌కుల‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. త‌న‌ను ప‌రియ‌యం చేసింది రాఘ‌వేంద్ర‌రావు అని, త‌న‌లోనూ ఓ న‌టుడు ఉన్నాడ‌ని కృష్ణ‌వంశీ నిరూపించార‌ని, ఓవ‌ర్సీస్‌లో అభిమానులు పెర‌గ‌డానికి త్రివిక్ర‌మ్ తీసిన అత‌డు దోహ‌ద‌ప‌డింద‌ని, దూకుడు త‌న‌కు మైల్ స్టోన్ అని, ఇలా ప్ర‌తీ సూప‌ర్ హిట్ సినిమానీ గుర్తు చేసుకుని అతి ముఖ్య‌మైన పోకిరిని వ‌దిలేశాడు.

 

ఇది మ‌తిమ‌రుపా? లేదంటే పూరీని, పోకిరిని ప‌క్క‌న పెట్ట‌డానికి ఏమైనా కార‌ణాలున్నాయా? అంటూ అప్పుడే ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌లైపోయాయి. అయితే త‌న పొర‌పాటుని గ్ర‌హించిన మ‌హేష్‌ వెంట‌నే ట్వీట్ చేశాడు. పోకిరి త‌న‌ని సూప‌ర్ స్టార్‌ని చేసింద‌న్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌ప‌రిచాడు. పూరికి ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు చెప్పాడు. పూరి కూడా దాన్ని రీట్వీట్ చేశాడు. మొత్తానికి పూరి ఎపిసోడ్ ట్వీట్‌తో సుఖాంతం అయిపోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS