స్పైడర్ చిత్రాన్ని దాదాపుగా పూర్తిచేసిన మహేష్, ఇప్పుడు తన తాజా చిత్రం భరత్ అను నేను షూటింగ్ లో బిజీ ఉన్నాడు.
అయితే ఈ షూటింగ్ కొన్ని కారణాల వాళ్ళ ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే, భరత్ అను నేను చిత్రం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన లక్నోలో షూటింగ్ జరప తలచింది. కాని అక్కడ షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలు ఆర్కీయాలజీ వారి అధీనంలో ఉండడం, వారి వద్ద నుండ అనుమతులు దొరక్కపోవడం వల్ల ఈ షూటింగ్ కి బ్రేక్ పడింది.
దీనితో చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఇప్పటికే కొంత పార్టుని చిత్రీకరించిన దర్శకుడు ఇప్పుడు మహేష్ ఉన్న సన్నివేశాలని షూట్ చేయనున్నాడు.