అడివి శేష్ ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్..!

By iQlikMovies - August 08, 2018 - 16:16 PM IST

మరిన్ని వార్తలు

గూఢ‌చారి చిత్రంతో అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసిన అడివి శేష్ పైన ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రం చూసి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది.

ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటంటే- తెలుగులో ఇటువంటి ఒక స్పై చిత్రం తీయడం నిజంగా సాహసం. అదే సమయంలో సినిమా కూడా ఒక బాండ్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా తీయడం నిజంగా అభినందనీయం. నటీనటులందరూ చాలా బాగా చేశారు మరీ ముఖ్యంగా అడివి శేష్ అయితే పలురకాలుగా అందరినీ మెప్పించాడు.

ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అడివి శేష్ సహా అభిషేక్ పిక్చర్స్ తమ చిత్రాన్ని ఇంతలా మెచ్చుకున్నందుకు వారంతా మహేష్ కి అభినందనలు తెలియచేశారు. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతున్నది.

గూఢ‌చారి చిత్రానికి అడివి శేష్ కథ, కథనం అందించగా శశికిరణ్ దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS