విశ్వరూపం 2 విడుదల పైన అనుమానాలు!!

By iQlikMovies - August 08, 2018 - 15:57 PM IST

మరిన్ని వార్తలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి M కరుణానిధి మరణంతో తమిళనాట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్దీవదేహాన్ని ఆఖరి సారి చూసేందుకు దేశం నలుమూలల నుండి ప్రముఖులు చెన్నైకి చేరుకుంటున్నారు.

ఇక కరుణానిధి మృతికి యావత్ తమిళనాడు లో అప్రకటిత బంద్ కొనసాగుతున్నది. ఈ నేపధ్యంలో ఎల్లుండి విడుదల కావాల్సి ఉన్న కమల్ హాసన్ విశ్వరూపం-2 భవితవ్యం డోలాయమానంలో పడిపోయింది. తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగి ఉన్న ఈ తరుణంలో విశ్వరూపం 2 విడుదల చేయడం ఎంతవరకు సబబు అన్న చర్చలు నడుస్తున్నాయి.

ఇప్పటికైతే ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రానప్పటికి విశ్వరూపం 2 వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. విశ్వరూపం 2 తమిళ, హిందీ బాషలలో నిర్మితమవ్వగా తెలుగులోకి అనువదించబడింది.

ఇక ఈ విడుదల పై క్లారిటీ కొద్దిసేపట్లో రావొచ్చు అని సమాచారం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS