మహేష్, రాజమౌళి సినిమా పై ఆసక్తిగా ఉన్నారు, ఫాన్స్, సినీ ప్రియులు. ఈ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. మిగతా వివరాలు అఫీషియల్ గా ఎప్పుడు వెల్లడి అవుతాయి అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. SSMB-29 గూర్చి రోజుకొక న్యూస్ బయటికి వచ్చి వైరలవుతోంది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ హింట్ ఇచ్చారు. దీనితో రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీ కాస్టింగ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి, RRR తరవాత రాజమౌళి కీర్తి విదేశాలకి సైతం పాకింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వరల్డ్ వైడ్ గా అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్, విలన్, స్టోరీ, రెమ్యూనరేషన్, టెక్నికల్ టీం గురించి ఎక్కడో ఒకచోట ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు మహేష్ ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహేష్ గారాలపట్టి సితార SSMB -29 చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. జక్కన్న మూవీటీమ్ తో వర్క్ షాప్ మొదలు పెడతారన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మహేష్ కొన్ని నెలలుగా బాడీ మేకోవర్ కి కసరత్తులు చేస్తున్నారు. రీసెంట్ గా జర్మనీకి వెళ్లి బాడీ ఫిట్ నెస్ కి అవసరమైన ట్రైనింగును పూర్తి చేసుకున్నారు. ఇంకో నాలుగు నెలలు ఈ వర్క్ షాప్ కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వర్క్ షాప్ లో మహేష్ తో పాటు సితార కూడా పాటిసిపేట్ చేయనుందని టాక్. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ మూవీ ద్వారా, అదీ జక్కన్న చేతులమీదుగా సితారను లాంచ్ చేస్తే ఆమె కెరియర్ కి ఢోకా ఉండదని, ఒక్క సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని మహేష్ , నమ్రతలు ప్లాన్ చేస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. సితారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. ఇపుడు తండ్రి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో స్క్రీన్ షేర్ చేసుకొంటోంది.