ఫ్లాప్‌ అయినా మోజు తీరలేదా.. మహేషా.?

By Inkmantra - January 23, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు - ఎ. ఆర్‌. మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ 'స్పైడర్‌' మహేష్‌ కెరీర్‌లో నిరాశ మిగిల్చిన సంగతి తెలిసిందే. తమిళ తంబీలకు మహేష్‌ బాబుని పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. రిజల్ట్‌ పోజిటివ్‌గా వచ్చి ఉంటే, మరోలా ఉండేది. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో మహేష్‌ బాబు స్పై పాత్రలో నటించాడు. ఇప్పుడీ పాత్ర సంగతి ఎందుకంటారా.? మళ్లీ ఇదే పాత్రలో మహేష్‌ కనిపిస్తున్నాడంటూ టాక్‌ వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి - మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో మహేష్‌బాబు స్పై అవతారమెత్తనున్నాడట.

 

కథ పరంగా ఈ సినిమాలో మహేష్‌ ఆ పాత్ర పోషించాల్సి వస్తోందట. అయితే, ఫ్లాప్‌ క్యారెక్టర్‌ కదా.. మహేష్‌ ఎందుకు ఆ క్యారెక్టర్‌ని టచ్‌ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అక్కడున్నది వంశీ పైడిపల్లి. ఎలాంటి మ్యాజిక్‌ అయినా చేయగలడు. ఏం మ్యాజిక్‌ చేస్తాడో ఏమో కానీ, ఈ పాత్రలో మళ్లీ మహేష్‌ని ప్రవేశ పెట్టబోతున్నాడనుకోవాలి. అయితే, ఇదంతా జస్ట్‌ గాసిప్‌ మాత్రమే. ప్రస్తుతం మహేష్‌బాబు ఓ పక్క 'సరిలేరు..' సక్సెస్‌నీ, మరోవైపు విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌నీ ఎంజాయ్‌ చేస్తున్నారు. విదేశాల నుండి రాగానే వంశీ స్క్రిప్టుపై వర్క్‌ చేయనున్నారు. ఈలోగా వంశీ పైడిపల్లి ఇక్కడ సర్వం సిద్ధం చేసి ఉంచుతారన్న మాట. ఆ క్రమంలోనే సీరియస్‌గా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నారు వంశీ పైడిపల్లి. అయితే, ఈ లోగానే మహేష్‌ క్యారెక్టర్‌పై ఈ స్పై పొగను రాజేశారెవరో. చూడాలి మరి,ఈ గాసిప్‌ నిజమా.? కాదా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS