మ‌హేష్ ఫ్యాన్స్ కోసం.. మ‌రో సీన్‌.

By Gowthami - January 22, 2020 - 17:42 PM IST

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి విడుద‌లై - మంచి విజ‌యాన్ని అందుకుంది 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. మ‌హేష్ గ‌త చిత్రాల రికార్డుల‌న్నింటినీ స‌రిలేరు బ‌ద్ద‌లు కొట్టింది. మ‌రో వారం రోజుల పాటు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో ఉంచేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అలా జ‌ర‌గాలంటే చూసిన‌వాళ్లే.. మ‌ళ్లీ ఈ సినిమాకి రావాలి. అందుకోసం దిల్ రాజు మాస్ట‌ర్ ప్లానే వేశాడు. ఈ సినిమాలో మ‌రో సీన్ జోడించ‌బోతున్నారు. ఈ స‌న్నివేశం దాదాపు రెండు నిమిషాలు ఉండ‌బోతోంద‌ట‌. మ‌హేష్ బాబు, రావు ర‌మేష్ ల‌మ‌ధ్య సాగే ఈ సీన్ హిలేరియ‌స్‌గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

 

మ‌హేష్ అభిమానుల‌కు ఈ స‌న్నివేశం మ‌రింత న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ట్రైన్ ఎపిసోడ్‌లో భాగంగా స‌న్నివేశం రాబోతోంది. అయితే.. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్ బాగా ల్యాగ్ అయ్యింద‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. ఈ సినిమాకి ట్రైన్ ఎపిసోడే మైన‌స్ అయ్యింద‌న్న కామెంట్లు వ‌చ్చాయి. అయినా కూడా.. ఆ ఎపిసోడ్‌లో మ‌రో స‌న్నివేశం జోడించ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశ‌మే. మ‌రి ఆ స‌న్నివేశంలో ఏముందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS