రాఖీ పండగకి మహేష్ సూచన!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్ననే తన పుట్టినరోజున తనవాళ్ళ మధ్యలో చాలా ఘనంగా జరుపుకున్నారు. దీనితో పాటుగా ఆయన తాజా చిత్రం మహర్షి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడం జరిగింది.

ఇంతటి ఆనంద సమయంలో ఆయన ఒక సామాజిక ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. అదేంటంటే- వచ్చే రాఖీ పండగకి అందరూ అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి హెల్మెట్ ని బహుమతిగా ఇవ్వండి అని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అని అందుకే తమ అన్నదమ్ములకి హెల్మెట్ ఇచ్చి తమ కుటుంబాలని కాపాడుకోండి అంటూ జనహితం కోసం ఈ ప్రకటన జారీ చేశాడు.

తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత మొదలుపెట్టిన రాఖీకి హెల్మెట్ అనే ఈ కార్యక్రమానికి తనవంతుగా మహేష్ బాబు కూడా ఈ కార్యక్రమ్మాన్ని ప్రచారం చేశాడు. ఇంతటి మంచి విషయానికి మహేష్ బాబు తన మద్దతు తెలపడం నిజంగా అభినందించాల్సిన విషయం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS