పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తెలుగులో హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు 'బద్రి', 'జానీ'ల్లో పవన్ కళ్యాణ్‌కి జోడీగానే నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు రేణూదేశాయ్. అయితే ఈ మధ్య రేణూ దేశాయ్ పేరు వార్తల్లో ఏదో ఒక రకంగా మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించడమే. కేవలం ప్రకటనే కాదు, ఆల్రెడీ నిశ్చితార్ధం కూడా చేసుకుంది రేణూదేశాయ్. రేణూదేశాయ్ రెండో పెళ్లితోనే హాట్ టాపిక్ అయిపోయింది.
ఇక ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా రేణూ దేశాయ్ టాలీవుడ్లో సందడి చేయనుంది. అయితే ఈ సారి తెరపై కాదు, తెర వెనుక. అంటే డైరెక్టర్‌గా, నిర్మాతగా సత్తా చాటాలనుకుంటోందట. ఆల్రెడీ నిర్మాతగా మరాఠీలో సినిమాలు రూపొందించిన అనుభవం ఉంది రేణూదేశాయ్‌కి. ఆ అనుభవాన్ని ఇప్పుడు టాలీవుడ్‌కి తీసుకొస్తుందట. ఆల్రెడీ ఓ సినిమా కోసం స్క్రిప్టు పనులు కూడా సిద్దమైపోయాయట. టాలీవుడ్లో రేణూదేశాయ్ తెరకెక్కించబోయే సినిమా ఓ లవ్ స్టోరీ అని గతంలో వార్తలు వచ్చాయి.
అయితే కాదట. రైతు సమస్యలపై రేణూదేశాయ్ సినిమా ఉండబోతోందని తాజాగా తెలుస్తోంది. అందుకోసం రైతులతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుని హృద్యంగా సినిమా రూపొందించాలనుకుంటోందట రేణూదేశాయ్.
చూడాలి మరి డైరెక్టర్‌గా రేణూ టాలీవుడ్లో ఎంత మేర సక్సెస్ అవుతుందో. అన్నట్లు ఈ సినిమాకి నిర్మాత కూడా రేణూదేశాయేనని సమాచారమ్.