టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను తీస్తూ ఉంటుంది. ఈ జాబితాలో ఇంతవరకూ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హవా కొనసాగుతూ వచ్చేది. 2013లో మోస్ట్ డిజైరబుల్ 50 లిస్టులో మహేష్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా, మెల్ల మెల్లగా ఆ ప్లేస్ తగ్గిపోతూ వచ్చింది. 2015లో మహేష్ ఆరవ స్థానంలో నిలిచారు. అలా మోస్ట్ డిజైరబుల్ మెన్ 2016 టాప్‌టెన్ జాబితాలో మహేష్ ఏడవస్థానం దక్కించుకున్నారు. ఏది ఏమైనా సౌత్ ఇండస్ట్రీ నుండి మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ టెన్ రేంజ్‌లో నిలిచిన ఒకే ఒక్క స్టార్‌గా మహేష్‌బాబు నిలవడం విశేషం. దీనికంతటికీ మహేష్ వయసు పెరిగినా టీనేజ్ కుర్రాడిలా అమ్మాయిల మనసుల్ని దోచుకునే అందంతో ఆకట్టుకోవడమే. అందుకే మ..హే..ష్.. ఆ పేరులోనే ఏవో వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక ఈ జాబితాలో మిస్టర్ ఇండియా 2015 స్థానాన్ని దక్కించుకున్న రోహిత్ ఖందేవాల్ ప్రధమ స్థానంలో ఉండగా, క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానం దక్కించుకున్నారు. ఇక మూడో స్థానంలో గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ నిలిచారు. మరో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నాలుగో స్థానంలోనూ, ఫవాద్‌ఖాన్ ఐదో స్థానంలోనూ, సిద్దార్ధ్ మల్హోత్రా ఆరో స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ నటులు ప్రబాస్, రానా కూడా ఉన్నారు. అయితే ప్రబాస్ 22వ స్థానాన్ని, రానా 24వ స్థానాన్ని దక్కించుకున్నారు. తమిళ నటుడు ధనుష్ 26వ స్థానంలో నిలిచారు.