మహేష్ బాబు ఫాన్స్ మధ్య చిచ్చు పెట్టిన కత్తి మహేష్..!

మరిన్ని వార్తలు

ప్రముఖ సెలబ్రిటీ అయిన మహేష్ కత్తి మళ్ళీ వార్తల్లోకి వచ్చేశాడు.

అయితే పోయినసారి ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు, ఇక ఇప్పుడు మరో హీరో ఫ్యాన్స్ పైన చేసిన కామెంట్స్ తో మళ్ళీ టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే, మొన్న జరిగిన భరత్ బహిరంగసభలో మహేష్ అభిమానులు స్టేజి పైన అతిధులు మాట్లాడే సమయంలో అరవడం, గోల చేయడం వంటివి చేశారు.

దీనితో నటుడు ప్రకాష్ రాజ్ ఆయన ప్రసంగం మధ్యలో స్టేజీ దిగి వెళ్ళిపోయాడు. ఇక ఈ అంశం పైన మహేష్ కత్తి తన ట్విట్టర్ ద్వారా- “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచీ స్ఫూర్తి పొందుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!?!” ఇలా చెప్పేశాడు.

ఇక ఈ కామెంట్ ని మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఆయన పైన కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వెయ్యడం మొదలుపెట్టారు. మరి దీని పైన మహేష్ కత్తి ఎలా స్పందిస్తారో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS