ఫాన్స్ నన్ను వెధవని చేసి చూపించారు: కత్తి మహేష్

మరిన్ని వార్తలు

ప్రముఖ సెలబ్రిటీ అయిన కత్తి మహేష్ ప్రేక్షకులు నన్ను వెదవని చేశారు అని కామెంట్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకి ఆయన ఈ పైన చెప్పిన విధంగా ఎందుకు స్పందించాడు అన్నది ఈ క్రింద చదవండి.

నిన్న జరిగిన నీది నాది ఒకే కథ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ- ఈ సినిమాని ఒక కవి అయిన వేణు తీయడంతో ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకి అర్ధమవుతుందా లేదా అన్న సందేహం కలిగింది. అందుకే ఇది సామాన్య ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకి ఒక సాధారణ సింగల్ స్క్రీన్ ధియేటర్ లో కూడా సినిమా అవ్వగానే స్టాండింగ్ ఒవేషణ్ వచ్చింది అని ఒక మిత్రుడు నాకు చెప్పాడు.

దీన్ని బట్టి నా అంచనా తప్పింది అని ఈ సినిమాని ఆదరించి ప్రేక్షకులు నన్ను వెదవని నిరూపించారు. అయితే ఇటువంటి సినిమాకి నన్ను తిట్టుకున్నా ఈ సినిమాని ఆదరించడం చాలా మంచిది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మొత్తానికి కత్తి మహేష్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS