#RRRలో రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడో తెలుసా..

మరిన్ని వార్తలు

ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చాలా వరకు ఆయన సినిమాల గురించిన వార్తలే బయటకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజమౌళి-ఎన్టీఆర్ తో చేయనున్న #RRR గురించిన ఒక సీక్రెట్ బయాకి వచ్చింది.

ఆ సీక్రెట్ ఏంటంటే- #RRR సినిమాలో రామ్ చరణ్ హార్స్ రైడర్ పాత్రలో కనిపిస్తాడట! రామ్ చరణ్ కి గుర్రాలు అన్నా, గుర్రపు స్వారీ అన్న ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మగధీర చిత్రంలో కూడా రామ్ చరణ్ గుర్రపు స్వారీని చాలా బాగా వాడుకున్నాడు అనే చెప్పొచ్చు.

ఇక ఇప్పుడు ఈ భారీ మల్టీ స్టారర్ లో కూడా రామ్ చరణ్ కి బాగా వచ్చిన అలాగే మెచ్చిన గుర్రపు స్వారీని మరోసారి ప్రేక్షకులకి భారీ స్థాయిలో చూపెట్టనున్నాడు అన్నది ఫిలిం నగర్ వర్గాల టాక్. మరి ఈ వార్త గనుక నిజమైతే ప్రేక్షకులకి మరోసారి గుర్రంతో చెర్రీ చేసే విన్యాసాలు చూడొచ్చు. 

ఇక రామ్ చరణ్ పాత్ర గురించిన విషయం బయటకి రాగానే మరి తారక్ ని ఎలా చూపెట్టబోతున్నాడు అన్న ప్రశ్న మొదలైపోయింది. అయితే వీటన్నిటికి సమాధానాలు మాత్రం రాజమౌళినే చెప్పగలడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS