మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది అని 'మహర్షి' డేట్ అయితే అనౌన్స్ చేశారు. కానీ సినిమా విడుదలపై సర్వత్రా అనుమానాలే. అందుకు కారణం మహర్షి షూటింగ్ పూర్తి కాకపోవడమే. ఇక ఇప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 'మహర్షి'కి గుమ్మడి కాయ కొట్టేశారు. ఇక నిర్మాణానంతర కార్యక్రమాలే మిగిలి ఉన్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మహేష్‌బాబు సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి, ట్వీటేశారు. 'మహర్షి' ఇట్స్ ఏ ర్యాప్.. అని కేకు మీద రాసున్న ఫోటో పోస్ట్ చేసి, మే 9న మిమ్మల్ని ధియేటర్స్‌లో కలుస్తాను..' అంటూ ట్వీట్ చేశారు.
మహేష్ నుండి ఏ చిన్న ట్వీట్ వచ్చినా అదో పెద్ద పండగే అభిమానులకు. ఈ ఫోటోకి అప్పుడే బోలెడన్ని లైకులూ, షేర్లూ వచ్చేశాయి. ఇంతవరకూ విడుదలైన ఆడియో సింగిల్స్, పోస్టర్స్ ఆశక్తిని పెంచాయి. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు 'ఎవరెస్టు అంచున..' అంటూ సాగే సాంగ్ వీడియో ప్రివ్యూను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్రయూనిట్ భావిస్తోంది.
అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.