సూపర్‌ స్టార్‌ మహేష్‌: ఆకాశమంత అభిమానం

By iQlikMovies - November 26, 2018 - 12:26 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుని, ఆయన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణని అభిమానించేవారూ అభిమానిస్తుంటారు. అయితే 106 ఏళ్ళ వృద్ధురాలు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకి వీరాభిమాని అంటే నమ్మగలరా? రేలంగి సత్యవతి అనే 106 ఏళ్ళ వృద్ధురాలు నిజంగానే మహేష్‌బాబుకి వీరాభిమాని. తన అభిమాన హీరోని కలుసుకోవాలన్న ఆమె కోరిక, 'మహర్షి' సినిమా సెట్‌లో తీరింది. సెట్‌లో మహేష్‌బాబుని కలిసే అవకాశం రేలంగి సత్యవతికి కల్పించారు.

తన అభిమాన హీరోతో కలిసి మాట్లాడటం పట్ల సత్యవతి హర్షం వ్యక్తం చేశారు. అంతకన్నా అమితానందం పొందాడు మహేష్‌బాబు. ఎందుకంటే, తన వయసువారు.. తనకంటే వయసు తక్కువవారు తనను అభిమానించడం మహేష్‌కి తెలుసు. తన తండ్రిని అభిమానించేవారూ తనను అభిమానిస్తారని మహేష్‌కి తెలుసు. కానీ, 106 ఏళ్ళ వృద్ధురాలు తనను అభిమానించడమంటే అది మహేష్‌కి 'ఎవరెస్ట్‌ శిఖరమంత' గొప్పతనమే.

పెద్దల పట్ల అమితమైన గౌరవాభిమానాలు కలిగిన మహేష్‌ని పెద్దవారు ఇష్టపడటం ఆశ్చర్యం కలిగించదనీ, తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు కూడా మహేష్‌ని అభిమానిస్తారని హీరో సుమంత్‌ పేర్కొన్నాడు. ఇదిలా వుంటే మహేష్‌, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. 'మహర్షి' తర్వాత, సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS