నిన్న చెన్నైలో స్పైడర్ చిత్రానికి సంబందించిన తెలుగు,తమిళ ఆడియో రిలీజ్ తో పాటుగా మహేష్ తమిళ చిత్రసీమలోకి పరిచయ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
ఈ చిత్రం తనకెంత ప్రత్యేకమో అని మహేష్ మాట్లాడుతూ- మురుగదాస్ తనకి ఈ కథ ఎలా వినిపించారో అదే తీశారు అని చెప్పాడు. మురుగదాస్ చిత్రాలలో తుపాకి చిత్రం అంటే తనకి బాగా ఇష్టం అని, ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ కూడా ప్రయత్నించినట్టు తెలిపాడు.
ఇక ప్రతినాయక పాత్ర పోషించిన ఎస్ జే సూర్య తనకి దర్శకుడిగా పరిచయం అని అలాంటిది ఆయనతో ఇలా నటించడం చాలా సరదాగా అనిపించిదన్నాడు. తమిళంలో ఇన్ని రోజులకి అడుగుపెడుతుండడంతో తనకి ఇది మొదటి చిత్ర సమయంలో ఉన్నంత ఉద్వేగంగా ఉందని చెప్పాడు.
దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని మహేష్ సహకారం లేకుంటే పూర్తీ చేసేవాడ్ని కాదు అని చెప్పాడు. ఒకేసారి రెండు బాషల్లో తెరకెక్కించే అనుభవం లేకపోవడం కూడా ఈ చిత్రం లేట్ అవ్వడానికి ఒక కారణం అని చెబుతూ, ఈ చిత్రానికి ఎస్ జే సూర్య, హారిస్ జయరాజ్, పీటర్ హేయన్స్ అందించిన సహకారం మరువలేను అని వారికి కృతజ్ఞతలు చెప్పాడు.