సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ చిత్రం వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా తీవ్ర నష్టాల్లో ఉన్నయూనిట్ కి ఒక వివాదం ఎదురైంది.
వివరాల్లోకి వెళితే- స్పైడర్ చిత్రంలో హిందూస్మశాన వాటికలో చిత్రీకరించిన సన్నివేశాలు తమ మనోభావాలని కించపరిచేలా ఉన్నాయి అంటూ రాష్ట్ర కాటి కాపర్ల సంఘం అధ్యక్షుడు శీలం సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సన్నివేశాలని వెంటనే చిత్రం నుండి తొలిగించాలని డిమాండ్ చేశారు. ఆ సన్నివేశాలు ఉండటం వలన తమ వృత్తిని తక్కువగా చూపించినట్టుగా ఉన్నందున సదరు సన్నివేశాలను తీసేయండి అంటూ స్పైడర్ చిత్ర యూనిట్ ని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ అంగీకరించకపోతే తమ ఆందోళనలని తీవ్రతరం చేస్తామని చెప్పారు.