మ‌హేష్ ఫ్యాన్స్‌కి చేదు వార్త‌!

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి ఇది చేదు వార్తే. వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడ‌ర్ సినిమా మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుద‌ల అవుతుంద‌నుకొన్నారు. అది కాస్త మేకి వెళ్లింది. జూన్ 23న స్పైడ‌ర్ వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు కూడా. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా వాయిదా వేశారు. జూన్ 23న మ‌హేష్ బ‌రిలోకి దిగ‌డం లేదు. వీఎఫ్ఎక్స్ ప‌నుల్లో జాప్యం వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్యం అవుతోంద‌ని, జులైలో విడుద‌ల కానున్న‌ద‌ని స‌మాచారం. అందుకే డీజే డేట్‌ని జూన్ 23న ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS