అల్లు అర్జున్ ఫిలిం కెరీర్ ఒకసారి గమనిస్తే హార్డ్ వర్క్ తో పాటు ఒక మంచి ప్లానింగ్ కూడా కనిపిస్తుంది.
ఆ ప్లానింగ్ వల్లనే తన రేంజ్ ని పెంచుకున్నాడన్నది అక్షర సత్యం. అయితే ఈ సారి తన దువ్వాడ జగన్నాధం కోసం వేసిన స్కెచ్ మాత్రం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇదంతా దేనికంటే #DJ సినిమా రిలీజ్ డేట్ జూన్ 23న ఫిక్స్ చేయడమే.
కొద్దినిమిశాల క్రితమే అల్లు అర్జున్ ఈ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ అనౌన్స్ చేశారు. ఇప్పటికే మహేష్ తన సినిమా స్పైడర్ అలాగే నాని నిన్ను కోరి రిలీజ్ డేట్స్ జూన్ 23గా ప్రకటించేశారు.
అయితే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజున రిలీజ్ అవ్వడం వల్ల రెండు సినిమాలకి బిజినెస్ దెబ్బతింటాయి అనే ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. మరి ఇదంతా తెలిసే రిలీజ్ చేస్తున్నారా అంటే దానికి సమాధానం లేదు.
కాకపోతే ఇదే డేట్ అందరు కావాలని కొరుకొవడానికి కారణం, జూన్ 26న రంజాన్ రావడం దానితో పాటుగా లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడం కోసమే.
చూద్దాం.. ఈ ప్లానింగ్ ఉన్న హీరోలలో ఏ హీరో సక్సెస్ తో బయట పడతాడో.