మనం ధియేటర్ కి వెళ్ళగానే సినిమా మొదలయ్యే ముందు పొగత్రాగటం, మద్యపాన సేవిన్చాకండి అంటూ ప్రభుత్వం వారినుండి ఒక 5 నిమిషాల నిడివిగల ప్రచార కార్యక్రమం వస్తుంటుంది.
అయితే అది ప్రతి చిత్రానికి ముందు ప్రదర్శించాలి అన్నది సెన్సార్ బోర్డు వారి రూల్. కాని మహేష్ నటించిన స్పైడర్ చిత్ర దర్శక-నిర్మాతలు మాత్రం మా చిత్ర ప్రదర్శన జరిగే సమయంలో ఈ ప్రచార కార్యక్రమాన్నీ వేయవద్దు అంటూ అభ్యర్దించనుందట.
కారణమేంటంటే- తమ చిత్రంలో ఏపాత్ర కూడా మద్యపానం కాని దూమపానం చేస్తూ కనిపించారని, అదేకాకుండా తమ చిత్రంలో ఎక్కడ మద్యంబాటిళ్ళు కూడా కనపడవని అందుకే తమ చిత్రాన్ని సదరు ప్రచార కార్యక్రమం నుండి మినహాయించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరీ.. వీరి అభ్యర్ధన నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.