ఆనందో బ్రహ్మ చిత్రంతో తెలుగులో చాలా కాలం తరువాత హిట్ కొట్టింది నటీ తాప్సీ.
ఇక చాలా గ్యాప్ తరువాత తను చేసిన సినిమాని ప్రేక్షకులు ఆదరించిన ఆనందంలో ఉన్న తాప్సీ తన మనసులో ఉన్న ఒక కోరిక బయట పెట్టింది. అదేంటంటే- తనకి ఎపట్టినుండో చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటు ఒక స్వంత ఇల్లు ఉండాలని తన కోరిక అని చెప్పుకొచ్చింది.
అయితే తాను ఇప్పటికే ముంబైలో ఒక స్వంత ఇల్లు కొనుక్కునప్పటికి అది తాను కోరుకున్న పరిసరాల్లో దొరకలేదు అని కాని అలాంటి పరిసరాలతోనే హైదరాబాద్ లో ఒక ఇల్లు కొంటాను అని చెప్పింది.
హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండాలి అన్నది తన డ్రీం అని ఎందుకంటే నటిగా తనకి గుర్తింపు, పేరుప్రఖ్యాతలు ఇచ్చిన హైదరాబాద్ అంటే తనకి బాగా ఇష్టం అని తన మనసులో మాట బయటపెట్టింది.