ఓవర్సీస్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకి తిరుగే లేదు. అక్కడ మహేష్ సినిమాలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టాక్‌తో సంబంధం లేకుండా అక్కడ పిచ్చ పిచ్చగా వసూళ్లు సాధిస్తూంటాయి మహేష్ సినిమాలు. లేటెస్టుగా విడుదలైన 'స్పైడర్' జోరు ఓ రేంజ్‌లో ఉంది అక్కడ. విడుదలై 24 గంటలు కాకముందే అక్కడ 'స్పైడర్' సినిమా మిలియన్ డాలర్స్ వసూళ్ల దిశగా పరుగులు తీసేస్తోందంటేనే మహేష్‌కి ఓవర్సీస్‌లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్‌ని నెట్టుకొస్తాయి. అలాంటి తక్కువ సినిమాల్లో మహేష్, పవన్ సినిమాలకు అక్కడ తిరుగే లేదు. ఓవర్సీస్ మార్కెట్‌ని దుమ్ము దులిపేస్తారంతే ఈ ఇద్దరు హీరోలు. 'స్పైడర్' సినిమాకి నిన్నటి నుండే చాలా ప్రీమియర్ షోలు పడ్దాయి. టాక్‌తో సంబంధం లేకుండా 'స్పైడర్' దూసుకెళ్తోంది. ఒక్క రోజులోనే పరిస్థితి ఇలా ఉంటే 'స్పైడర్' సృష్టించే సెన్సేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలిక. మురుగదాస్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఆకాశమే హద్దు అన్నట్లుగా ఈ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన సినిమా 'స్పైడర్'. అనుకున్నట్లుగానే అంచనాల్ని అందుకునేలానే అనిపిస్తోంది ఓపెనింగ్ డే వసూళ్లు చూస్తుంటే. తెలుగు రాష్ట్రాల్లోనూ 'స్పైడర్' హవా అలానే ఉంది. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవుతుందన్న కాన్సెప్ట్‌ని బలంగా చూపించాడు ఈ సినిమాలో మురుగదాస్. ఎస్.జె.సూర్య విలన్‌గా అద్భుతమైన పర్‌పామెన్స్ ఇచ్చాడు.