తండ్రి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక అధ్బుతమైన ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తున్నది.

ఆ వివరాల్లోకి వెళితే, బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న “ఎన్టీఆర్” చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రకి ఆయన తనయుడు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించనున్నారట. అయితే దీని పైన ఆయన నుండి ఇంకా స్పందన వెలువడాల్సి ఉంది.

ఇదే సమయంలో ఈ చిత్రంలో ఇప్పటికే పలు పాత్రలకి ప్రముఖ నటీనటులని ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఇదే దారిలో సూపర్ స్టార్ మహేష్ ని కూడా ఈ చిత్రంలో నటింపచేసేందుకు ‘ఎన్టీఆర్’ చిత్ర యూనిట్ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒకవేళ మహేష్ బాబు గనుక ఈ చిత్రంలో నటించడానికి పచ్చ జెండా గనుక ఊపితే ఈ సినిమా పైన ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఏదేమైనా.. తన తండ్రి పాత్రలో మహేష్ కనపడితే ఫ్యాన్స్ కి ఇక ఆ కిక్కే వేరు అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS