స్టార్ హీరోయిన్ సమంతా ‘ముద్దు సన్నివేశాల’ పైన తనదైన శైలిలో ప్రశ్నించింది.
రంగస్థలం చిత్రం ప్రచార కార్యక్రమాలలో సమంతా మాట్లాడుతూ- చాలా మంది రంగస్థలం చిత్రంలో ముద్దు సన్నివేశానికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతున్నారు. అయితే ముందుగా ఒకటి చెప్పాలి, అది నిజమైన ముద్దు సన్నివేశం కాదు, కేవలం టెక్నికల్ గా అలా చూపించారు అని చెప్పింది.
ఆ తరువాత, ప్రతిసారి పెళ్ళి అయిన హీరోయిన్లనే ‘ముద్దు సన్నివేశాల’ గురించి ఎందుకు అడుగుతారు? ఇదే ప్రశ్నని పెళ్ళి అయిన హీరోలని ఎందుకు అడగరు? అని ప్రశ్నించింది. అలాగే పెళ్ళి తరువాత ఇటువంటి సన్నివేశంలో నటించినందుకు తన భర్త, కుటుంబం నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాలేదు.
ఇక రంగస్థలం విషయానికి వస్తే, ఆ సన్నివేశంలో హీరోకి తన ప్రేమని చెప్పడానికి అక్కడ ముద్దు సన్నివేశం పెట్టడం చాలా కరెక్ట్ అని దర్శకుడు చెప్పిన దానికి నేను కనెక్ట్ అయ్యాకనే ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది.
మొత్తానికి ‘ముద్దు’కి సంబంధించి సమంతా తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది.