స్పైడర్ చిత్రం సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోనుంది. దీనికి కారణమేంటంటే- ఈ చిత్రంతో మహేష్ తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇక తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతుండడంతో ఆయన ఎంట్రీని చాలా గ్రాండ్ గా చేయాలని స్పైడర్ చిత్ర నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం, తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ని కూడా ఆ ఈవెంట్ కి పిలవనున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగానే మహేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో అందరికి స్పైడర్ విషయాలని చెప్పనున్నాడట. ఇక దర్శకుడు మురుగదాస్ కూడా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ చిన్న దోర్లకుండా జాగ్రతపడినట్టు సమాచారం.