బిగ్‌హౌస్‌ నుండి మహేష్‌ వికెట్‌ అవుట్‌.!

By Inkmantra - October 14, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ లేటెస్ట్‌ వీక్‌లో రాయలసీమ బుల్లోడు మహేష్‌ విట్టా వికెట్‌ డౌన్‌ అయ్యింది. నిజానికి మహేష్‌ గతవారమే ఎలిమినేట్‌ కావల్సి ఉంది. కానీ, ఎందుకో పున్నరవిని ఎలిమినేట్‌ చేశారు. ఈ వీక్‌ మహేష్‌పై వేటు పడక తప్పలేదు. ఇక హౌస్‌లో చివరి రోజున్న మహేష్‌కి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తానే అని పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. మంచి రైటర్‌, నెరేటర్‌ కావడంతో, హౌస్‌నీ, హౌస్‌లోని పరిస్థితుల్ని బాగా అర్ధం చేసుకున్న మహేష్‌, 

 

హౌస్‌లో ఉండి చివరి మాటలుగా, ఆయా ఇంటి సభ్యులపై తన అమూల్యమైన అభిప్రాయాలను హోస్ట్‌ నాగార్జున ముందు వ్యక్త పరిచేశాడు. ఇక హౌస్‌లో ఉండేందుకు అర్హుడు కాడు అని ఎవర్ని చెబుతారు అంటే, ఇంటి సభ్యుల నుండి ఎక్కువ ఓట్లు మహేష్‌కే పడడం విశేషం. నిజానికి ఆ హౌస్‌లో మహేష్‌ వంటి మెంటాల్టీతో అన్ని రోజులు మసలడం కష్టమే. ఆ విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు మహేష్‌. 

 

సహజంగా ఎలా ఉంటామో, అలాగే హౌస్‌లో ఉంటామని చెప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చిన సభ్యులు లోపలికి వెళ్లాక విపరీత మనస్తత్వాలతో బిహేవ్‌ చేయాల్సి ఉంటుంది. వారిని అర్ధం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. మహేష్‌ అందర్నీ బాగానే అర్ధం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోని ఇంతవరకూ తన జర్నీలో చాలా నేర్చుకున్నాననీ చెప్పాడు. తనకు ఎక్కువగా ఉండే కోపాన్ని తగ్గించుకున్నాననీ చెప్పాడు. అందుకు కారణం బాబా భాస్కరే అనీ, బాబా భాస్కర్‌ని తన గురువుగా అభివర్ణించాడు మహేష్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS