అడవి శేష్ మేజర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగాతెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టారు. మహేష్ బాబు లాంటి స్టార్ నిర్మాత రూపంలో వున్నారు. 26/11 దాడులు, ఆ వార్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ బయోపిక్ గా సినిమాని రూపొందించారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలసి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ బయటికి వదిలారు. ఐతే ఎంత చేస్తున్నప్పటికీ మేజర్ పై ఇంకా సరైన బజ్ రావడం లేదు.
విడుదలకు ముందే ప్రివ్యూలు వేసేలా బుక్ మై షోతో ఒప్పందం కూడా కుదుర్చుకొని దేశంలో పలు నగరాల్లో మందస్తు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసింది మేజర్. అయితే సినిమాని ఇప్పటికిప్పుడే చూసేయాలనే ఉత్సాహం ఎవరిలో కనిపించడం లేదనే చెప్పాలి. ముంబాయి దాడుల్లో చాల సినిమాలు వచ్చాయి. వర్మ తీసిన సినిమా చాలా మందికి నచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే సంఘటనపై మేజర్ సందీప్ కోణంలో ఒక కథ చెబుతున్నారు. మేజర్ యూనిట్ మాత్రం సినిమాపై చాలా ఎక్సయింటింగా వుంది. ప్రస్తుతానికి ఆ ఎక్సయిట్మెంట్ మాత్రం ఆడియన్స్ నుండి ఇంకా రావాడం లేదు.