'మేజ‌ర్‌' మూవీ రివ్యూ రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ
దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా
నిర్మాత: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A ప్లస్ S సినిమాలు
సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: వినయ్ కుమార్ సిరిగినీడి & కోదాటి పవన్ కళ్యాణ్


రేటింగ్: 3.25/5


2611 దాడి... దేశ చరిత్రలో ఓ భయంకరమైన పీడకల. ఈ దాడిలో ఎంతోమంది సామాన్యులు ప్రాణాల్ని కోల్పోయారు. మరెందరో వీరులు ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలని త్యాగం చేసి అమరులయ్యారు. ' దేహం ఇస్తా, దేశాన్ని మాత్రం ఇవ్వను' అని గుండెలు వీరుచు నిలబడిన ఎంతో మంది ధీరులు వున్నారు, అలాంటి వారిలో `మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌` ఒక‌రు. తాజ్ దాడిలో వుగ్రమూకలతో అలుపెరుగని పోరాటం చేసిన మేజర్ సందీప్ కథ .. ఇప్పుడు 'మేజర్' గా వెండితెపై ఆవిష్కరించబడింది. ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన 'మేజర్' జీవితంలోకి ఒక్కసారి తొంగి చూస్తే..


కథ:


మ‌ల‌యాళీ కుటుంబానికి చెందిన సందీప్ ఉన్నికృష్ణన్ ( అడవి శేష్ ) అందరిలానే సాదారణ కుర్రాడు. చిన్నప్పటి నుంచీ సైన్యంలో చేరాల‌న్నది అతడి లక్ష్యం. సందీప్ తల్లి (రేవ‌తి), తండ్రి (ప్రకాష్‌రాజ్‌) కు సందీప్ సైన్యంలో వెళ్లడం ఇష్టం ఉండ‌దు. త‌ల్లితండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఆర్మీలో చేర‌తాడు సందీప్. ఆర్మీలో నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో 51 స్పెష‌ల్ యాక్షన్ గ్రూప్‌కు ట్రైనింగ్ ఆఫీస‌ర్ అవుతాడు. క్లాస్‌మేట్‌ ఇషాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె బెంగళూర్ లో వుంటుంది.


సందీప్ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేశానికే. భార్య కోసం తగిన సమయం కేటాయించలేకపోతుంటాడు. దీంతో ఇషాతో విబేధాలు కూడా మొద‌ల‌వుతాయి. ఈ క్రమంలో సందీప్ సెలవు తీసుకొని బెంగళూర్ వెళుతున్న సమయంలో ముంబైపై టెర్రరిస్టుల అతి కిరాత‌కం జరుగుతుంది. బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరిన సందీప్‌కు ఈ వార్త తెలియ‌గానే వెన‌క్కి తిరిగి వ‌చ్చేస్తాడు. తాజ్ లో ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి సందీప్ తన టీంతో బరిలోకి దిగితాడు. ఉగ్రవాదులతో ఎలాంటి పోరాటం? తాజాలో బంధీలుగా వున్న ప్రజలని ఎలా రక్షించారు ? ఎలా తన ప్రాణాలని పణంగా పెట్టాడనేది మిగతా కథ. 


విశ్లేషణ:


వరల్డ్ సినిమాలో విషాదకరమైన సంఘటనలు, యుద్ధాలు, దాడులపై అనేక చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని చరిత్రలో నిలిచిపోయాయి. మేజర్ కూడా అలా చరిత్రలో నిలిచిపోయే చిత్రమే. మేజర్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు.. వరల్డ్ క్లాస్ సినిమా. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ స్థాయి వున్న చిత్రం అనిచెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరుల పట్ల అందరికీ ప్రేమ భక్తి అభిమానం వుండటం సహజం. అలాంటి వీరుడి కథ సినిమాగా వచ్చినపుడు సహజంగానే ఒక గౌరవం వుంటుంది.


అయితే మేజర్ చిత్రాన్ని ఒక సింపతీ క్రియేట్ చేయాలనే కోణంలో ఒక్క షాట్ కూడా తీయలేదు. ఒక గొప్ప సినిమాకి ఉండాల్సిన ప్రతి లక్షణం మేజర్ లో కనిపిస్తుంది. ఇందులో రోమాలు నిక్కబొడుచుకొనే సన్నివేశాలు వున్నాయి, అత్యంత ఉద్వేగ‌భ‌రితమైన స‌న్నివేశాలు వున్నాయి, కళ్ళల్లో నీళ్ళు తిరిగే సీన్స్ వున్నాయి, ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలు వున్నాయి.. ఒక సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయంటే... అది వరల్డ్ క్లాస్ సినిమా, అవుట్ స్టాండింగ్ సినిమా. మేజర్ ఓ ఎపిక్. 


2611 దాడి అందరికీ తెలిసిన సంఘటన. ఈ దాడికి సంబధించిన సమాచారం, వీడియోలు, కొన్ని సినిమాలు వున్న్నాయి. ఐతే ఇదే దాడిని మేజర్ సందీప్ కోణంలో చూపించిన తీరు ప్రేక్షకుడిని కట్టిపారేస్తుంది. సందీప్ కోణంలో కథని ప్రారంభించిన దర్శకుడు.. దిన్ని సందీప్ కథగానే డీల్ చేశాడు. సందీప్ చిన్ననాటి సంఘటనలు, తల్లితండ్రులతో అతనికి వున్న అనుబంధం, చిన్ననాటి గర్ల్ ఫ్రండ్ ఇషాతో ప్రేమ.. ఇవన్నీ చాలా అందంగా ఎక్కడా బోర్ లేకుండా సాగిపోతాయి. నిజానికి సందీప్ జీవితంలో చాలా సినిమాటిక్ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా లవ్ ప్రపోజల్ సీన్ కమర్షియల్ సినిమాలో వుండే ఎమోషనే కనిపిస్తుంది. అయితే దర్శకుడు పనితీరు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. సందీప్ వ్యక్తిగత జీవితాన్ని ఆసక్తికరంగా చూపిస్తూనే ఎక్కడా బ్యాలన్స్ కోల్పోకుండా తీసిన విధానం అద్భుతంగా వుంది. 


ఇక ఈ మేజర్ లో అసలైన కథ తాజ్‌ హోటల్ కి మారిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఉగ్రవాదులు హోట‌ల్‌లో సృష్టించిన కిరాత‌కాండని చాలా రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు.  హోట‌ల్ లో  సందీప్ త‌న టీమ్‌తో ప్రజలని కాపాడ్డానికి ప్రద‌ర్శించే ధైర్య సాహ‌సాలు,  ప్రాణాల‌ను లెక్కచెయ్యకుండా చివ‌ర‌లో త‌నొక్కడే టెర్రిరిస్టులు ఉన్న చోట‌కు వెళ్లి వాళ్లతో త‌ల‌ప‌డే సీన్లు అవుట్ స్టాడింగ్ గా చిత్రీకరించారు. ప్రాణాలు పోతున్నా  దేశ ర‌క్షణే ధ్యేయంగా సాగించిన మేజర్ పోరాటం  ఎమోషనల్ గా వుంటుంది. ఇక చివర్లో తండ్రి ప్రకాష్ రాజ్ ఇచ్చిన ప్రసంగం గూస్ బంప్స్ తో పాటు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది. ఒక గొప్ప కథ, సినిమా చుశామనే అనుభూతిని కలిగిస్తుంది. 


నటీనటులు :


అడివి శేష్ కెరీర్ లో మేజర్ సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అతనిది. సందీప్ పాత్రని చాలా బాధ్యతతో చేశాడు. అతని కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా శేష్ నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. అచ్చు సందీప్ లానే కనిపించి న తీరు ఆకట్టుకుంది.


ప్రకాష్‌రాజ్‌, రేవ‌తి పాత్రలు అద్భుతంగా వున్నాయి. వారి అనుభవం ఈ పాత్రలు మోయడానికి కలిపోచ్చాయి. స‌యీ మంజ్రేక‌ర్ హుందాగా కనిపించింది. శోభిత‌ది చేసిన పాత్ర కూడా ఆకట్టుకుంది. ముర‌ళీ శ‌ర్మ తో పాటు మిగతా నటులు పరిధిమేర చేశారు.   


టెక్నికల్ గా :


టెక్నిక‌ల్  మేజర్ అత్యున్నతంగా వుంది ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ నేప‌థ్య సంగీతం అన్నీ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి.  సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ ప‌చ్చిపులుసు ప‌నిత‌నానికి గొప్ప మార్కులు పడతాయి. వరల్డ్ క్లాస్ విజువల్స్ కనిపించాయి. అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు పవర్ ఫుల్ గా వున్నాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు 


ప్లస్ పాయింట్స్ :


సందీప్ కథ 
యాక్షన్, ఎమోషనల్ సీన్స్ 
క్లైమాక్స్ 


మైనస్ పాయింట్స్:


సందీప్ ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి రెండు చోట్ల సాగదీత 


ఫైనల్ వర్దిక్ట్ : 'మేజర్' సందీప్ కి బిగ్ సెల్యూట్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS