ఆమెకు 45.. అతనికి 33.!

మరిన్ని వార్తలు

ఒకరేమో, ప్రముఖ నిర్మాత తనయుడు.. ఇంకొకరేమో, ఐటమ్‌ బాంబ్‌. ఈ ఇద్దరికీ మధ్య ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమ చిగురించిందోగానీ, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నారు. మీడియాని తప్పించుకు తిరగడం అంత తేలిక కాదు కదా! అడ్డంగా మీడియాకి దొరికేశారు. కానీ, ఇద్దరూ పెదవి విప్పడంలేదు. 

ఆమె వయసు ఏకంగా 45 ఏళ్ళు, అతని వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే. ఆమెకు బాలీవుడ్‌ నటుడు, నిర్మాతతో పెళ్ళయ్యింది, విడాకులు కూడా తీసుకుంది. బహుశా ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలనే పెద్ద మనసుతోనే ఆ కుర్రాడు ఆమెతో ప్రేమలో పడినట్టున్నాడు. బాలీవుడ్‌లో ఇప్పుడంతా చర్చించుకుంటున్నది ఈ అంశం గురించే. ఇందులో ఆమె మలైకా అరోరా అయితే, అతడు అర్జున్‌ కపూర్‌. 

'ప్రేమ' గురించి ఈ ఇద్దరూ ఇంతవరకూ ఎక్కడా రివీల్‌ చేయలేదు. అంతా గోప్యమే. కానీ, ఫొటోలకు మాత్రం దొరికేస్తున్నారు. సహజీవనం అనుకోవాలా? ఇంకేమన్నా అనుకోవాలా? స్పందించడానికి మాత్రం ఈ ఇద్దరూ సుముఖత వ్యక్తం చేయడంలేదు. బాలీవుడ్‌లో చక్కర్లు కొడ్తున్న గాసిప్స్‌ని బట్టి ఈ ఇద్దరూ త్వరలోనే వైవాహిక బంధంతో ఒక్కటబోతున్నారట. 

అదేంటీ, వయసులో తనకంటే పన్నెండేళ్ళ చిన్నోడిని ఈ భామ పెళ్ళి చేసుకోవడమా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సచిన్‌ టెండూల్కర్‌ కంటే అతని భార్య పెద్దదే కదా మరి! అని ఇంకొందరు అంటున్నారు. బాలీవుడ్‌లో ప్రేమలు, సహజీవనాలు, విడిపోవడాలు.. ఇవన్నీ మామూలే. మరి, మలైకా - అర్జున్‌ల విషయం ఏమవుతుంది? వేచి చూడాల్సిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS