మహేష్ భార్య పై మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్

మరిన్ని వార్తలు

మాజీ మిస్ ఇండియా, నటి, సూపర్ స్టార్ మహేష్ బాబు అర్ధాంగి అయిన నమ్రత పైన ప్రముఖ హిందీ హీరోయిన్ కొన్ని ఘాటు విమర్శలు చేస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే, ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి మలైకా అరోరా ఖాన్ తన మోడలింగ్ రోజుల గురించి మాట్లాడుతూ- తన మోడలింగ్ తొలి రోజుల్లో నమ్రత తనని కొద్దిగా చులకనగా చూసేది అని దానికి కారణం ఆమె తనకి మోడలింగ్ లో సీనియర్ గా ఉండడమే అని చెప్పింది.

అయితే ఇవన్నీ కొన్నిరోజులు మాత్రమే జరిగాయి అని తరువాత కాలంలో తామంతా మంచి స్నేహితులం అయ్యాము అని చెప్పుకొచ్చింది. మలైకా చేసిన ఈ వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే- మహేష్ బాబు భార్యగా ఆమెకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండడం అలాగే ఇప్పటివరకు ఆమెకి ఎవ్వరితోను ఎటువంటి మనస్పర్ధలు లేకపోవడమే.

మరి.. ఈ వ్యాఖ్యలకి నమ్రత ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS