బాలీవుడ్ భామ మలైకా అరోరా నాలుగు పదుల వయసులోనూ ఐటెం సాంగ్స్‌తో కిర్రాక్ పుట్టించింది. 'కెవ్వుకేకా..' అంటూ గబ్బర్‌సింగ్'లో ఆడి పాడింది. ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురైంది.
విషయం ఏంటంటే, బికినీలో ఫోటోలకు పోజులిచ్చి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత వల్గారిటీ అవసరమా అని ఆమెను ట్రోల్ చేశారు. దానికి మలైకా కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. ట్రోలర్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, వారిని పట్టించుకోవల్సిన అవసరం లేదు, స్విమ్మింగ్ పూల్‌లో నా నుంచి ఎలాంటి వస్త్ర ధారణను వారు ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదు. నా డ్రస్సింగ్ నా ఇష్టం అని చెప్పింది. లాజిక్ కెవ్వు కేక కదా.
ఈ విషయంలో ఆమెని తప్పు పట్టడానికి ఏమీ లేదు. అయితే బాత్రూమ్‌లో నగ్నంగా స్నానం చేయడం చాలా మందికి అలవాటే, అలాగని ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టలేరు కదా. ఇది ట్రోలర్స్ నుండి ఆమెకు ఎదురవుతున్న కౌంటర్. సెలబ్రిటీల వస్త్ర ధారణ వివాదాస్పదం అవడం మామూలే. టైం పాస్ కోసం కొందరు, పబ్లిసిటీ కోసం కొందరు తమ గ్లామర్‌ని సోషల్ మీడియాలో ఆరబోసేస్తున్నారు. కొందరు నెటిజన్లకు అసలే నిద్రలు పట్టట్లేదు.
పనీ పాట లేక సెలబ్రిటీస్‌ని కించపరచడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సెలబ్రిటీల లాజిక్‌లు, నెటిజన్ల రిటార్ట్‌లు ఈ గిల్లి కజ్జాలు వెరసి బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్.