మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కి ఈ మధ్య అంతగా కాలం కలిసి రావట్లేదు అనే చెప్పాలి. ఈ తరుణంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆయనని వార్తల్లో నిలిచేలా చేసింది.
ఆ వార్త ఏంటంటే- సాయి ధరం తేజ్ త్వరలో తాను చేయబోయే ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని ని ఎంపిక చేసుకున్నాడు. అయితే గతంలో వీరువురి కలయికలో వచ్చిన విన్నర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిన సంగతి విదితమే.
అసలే ఫ్లాపులతో సతమవుతున్న ఈ సమయంలో ఇలా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి సినిమా చేయడం అనేది నిజంగా చాలా గట్స్ ఉన్న నిర్ణయం అని ఇప్పుడు ఫిలిం నగర్ లో నడుస్తున్న చర్చ. త్వరలోనే ఈ చిత్రం పట్టలేక్కనుంది అని కూడా తెలుస్తున్నది.
మరి ఈ సారైనా ఈ ఇద్దరు హిట్ కొడతారా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.