ఏజ్‌ 'బార్‌' ఫిట్‌నెస్‌.. సో హాట్‌ గురూ.!

మరిన్ని వార్తలు

మలైకా అరోరా అంటేనే ఫిట్‌నెస్‌కి మారుపేరు. నాలుగు పదుల వయసులోనూ ఆమె చేయలేని వర్కవుట్లు లేవంటే అతిశయోక్తి కాదు. వర్కవుట్స్‌ చేయడం ఓ ఎత్తు. వాటిని ఎంజాయ్‌ చేస్తూ చేయడం ఇంకో ఎత్తు. ఆ సెకండ్‌ వన్‌ ఉందే అదే మలైకా అరోరాలో ని స్పెషల్‌ వన్‌.

 

వెకేషన్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లి, అక్కడి బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో ఈ ఏజ్‌బార్‌ బ్యూటీ యోగాసనాలు చేస్తూ, కెమెరాలకు పోజిచ్చి, ఆ పిక్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇక తాజాగా మలైకా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తే కుర్ర హీరోయిన్లు సైతం షాకవ్వాల్సిందే. అందుకేనా ఈ అంటీ ఇంత ఫిట్‌గా ఉంది. మాకు అంత గట్టి పోటీ ఇస్తోంది అనుకోకుండా ఉండలేరు. ఓ బార్‌కి వేలాడుతూ చేతులపై రివర్స్‌ బ్యాలెన్స్‌ చేసి, కాళ్లతో పర్‌ఫెక్ట్‌గా ఆమె చేసిన ఫీట్లు చూస్తుంటే కేకో కేక.. కెవ్వు కేక అనాల్సిందే.

 

అందుకే మరి ఓ టీనేజ్‌ కుర్రగాడికి తల్లయినా, మరికొంతమంది టీనేజ్‌ కుర్రగాళ్లు ఆమె అందం మత్తులో అంతలా ఊయలలూగుతున్నారు. తన కన్నా వయసులో చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో మలైకా లవ్వాయణం గురించి అందరికీ తెలిసిన సంగతే కదా. ఎంతైనా మలైకా ఫిట్‌నెస్‌ ఈజ్‌ సో గ్రేట్‌నెస్‌ అబ్బా. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS