రియల్ లైఫ్‌లో బాక్సింగ్ ఛాంపియన్ అయిన ముద్దుగుమ్మ రితికా సింగ్ అదే టాలెంట్‌ని యూజ్ చేసుకుని హీరోయిన్‌గా ఎదిగింది. తొలి సినిమా 'ఇరుందు చట్రం' బాక్సింగ్ నేపథ్యంలో కోలీవుడ్‌లో తెరకెక్కింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇదే సినిమాని హిందీలోనూ, తెలుగులోనూ రీమేక్ చేశారు ఇదే భామని హీరోయిన్‌గా తీసుకుని.
మూడు భాషల్లోనూ తనదైన నటనను కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది రితికా సింగ్. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేసింది. ఓ పక్క బాక్సింగ్ కెరీర్‌ని లీడ్ చేస్తూనే, మరోపక్క సినిమాల్లోనూ రాణిస్తోంది. సినిమాల్లో పెద్దగా గ్లామర్‌కి చోటున్న అవకాశాలు రావపోవడంతో, అప్పుడప్పుడూ గ్లామర్ పోజులతో సోషల్ మీడియానీ హీటెక్కించేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి తెలుగులో ఓ బంపర్ ఛాన్స్ దక్కిందనీ సమాచారమ్. అది కూడా తనకు చాలా ఇష్టమైన పాత్రనీ తెలుస్తోంది. మరోవైపు తమిళంలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో రితికా మరోసారి బాక్సర్ పాత్రలోనే కనిపించనుందట.
తొలిసినిమా 'ఇరుందు చట్రం' (తెలుగులో 'గురు') లో పోషించిన క్యారెక్టర్‌కి భిన్నంగా ఉంటుందట ఈ సినిమాలో రితికా బాక్సర్ క్యారెక్టర్. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందంటోంది రితికా సింగ్. ఇక అరుణ్‌విజయ్ 'బ్రూస్‌లీ' సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ప్రస్తుతం ప్రబాస్ చిత్రం 'సాహో'లో నటిస్తున్నాడు.